ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భిక్షాటన నిషేధ చట్టంలో కీలక మార్పులు చేసింది.

భారత్ న్యూస్ నెల్లూరు….ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భిక్షాటన నిషేధ చట్టంలో కీలక మార్పులు చేసింది. ‘లెప్పర్’, ‘ల్యూనాటిక్‌’ వంటి అభ్యంతరకర పదాలను తొలగించి, వాటి స్థానంలో ‘కుష్టు వ్యాధి సోకిన వ్యక్తి’, ‘మానసిక వ్యాధిగ్రస్థుడు’ అని చేర్చింది. ఈ మార్పులు గౌరవప్రదమైన భాషను ప్రోత్సహిస్తాయి. మరోవైపు, రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ ‘భిక్షాటన నివారణ (సవరణ) చట్టం- 2025’ను అధికారికంగా ప్రచురించింది. ఈ చట్టం ద్వారా నిరుపేదలకు పునరావాసం కల్పించి, గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది