కార్యకర్తల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం : కనపర్తి

భారత్ న్యూస్ విజయవాడ..కార్యకర్తల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం : కనపర్తి

నాగాయలంక : కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ అధిక ప్రాధాన్యమిస్తోందని,పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని, వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని లోకేష్ భరోసా ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మరియు అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. నాగాయలంక మండలం పరచివర పంచాయతీ శివారు గణపేశ్వరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త చాట్రగడ్డ సువర్తమ్మ మే 9వ తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆమె భర్త బాబురావుకి రూ.5 లక్షలు చెక్కును కనపర్తి శ్రీనివాసరావు ఆదివారం అందజేశారు.ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు,నాగాయలంక పార్టీ అధ్యక్షుడు మెండు లక్ష్మణరావు,పార్టీ నేతలు మంచాల బాబు, పర్చూరి దుర్గాప్రసాద్,బండే రాఘవ ,మేడికొండ విజయ్ ,మంచాల మహేంద్ర, చిక్కాల జైపాల్ చాట్రగడ్డ లేలమ్మ, నీలా రాజేష్, చాట్రగడ్డ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు