భారత్ న్యూస్ అనంతపురం…స్టూడెంట్స్ తో కాళ్లు నొక్కించుకున్న టీచర్.

Ammiraju Udaya Shankar.sharma News Editor..పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయురాలు వారితో కాళ్లు పట్టించుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసింది. ఇక్కడి ఉపాధ్యాయురాలు సెల్ ఫోన్ లో మాట్లాడుతూ.. ఇద్దరు విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంటున్న వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ విషయంపై ఐటీడీఏ సీతంపేట పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ మాట్లాడుతూ.. సంబంధిత ఉపాధ్యాయురాలికి ఇప్పటికే షోకాజ్ నోటీసు జారీ చేశామని, విచారణకు ఆదేశించామని చెప్పారు.
కాపీ -DEO శ్రీకాకుళం
