పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలు పోలింగ్ 7గం.లకు ప్రారంభమైన

భారత్ న్యూస్ గుంటూరు ….పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలు పోలింగ్ 7గం.లకు ప్రారంభమైన దగ్గర నుంచీ పెద్ద అరాచకం రాజ్యమేలుతోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు, ఓటర్లు బూతుల్లోకి వెళ్లకుండా తెలుగుదేశం పార్టీ, పోలీసులు కలిసి కట్టుగా కుట్రను అమలు చేస్తున్నారు. వెళ్లిన మా ఏజెంట్లను తెలుగుదేశం గూండాలు, పోలీసులు కలిసి బయటకు లాగేశారు. వైయస్ఆర్ సీపీకి చెందిన వారు అని తెలిస్తే వాళ్ల స్లిప్ లు లాగేసుకుంటున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి, ప్రజలు తిరగబడటంతో వదిలిపెట్టారు. మా నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. గతంలో నంద్యాల ఎన్నికల్లోనూ చంద్రబాబు ఇదే విధంగా చేశాడు.

-అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు