పోఖరా నుంచి ఖాట్మండూ బయలుదేరిన తెలుగు పౌరులు

భారత్ న్యూస్ విజయవాడ…పోఖరా నుంచి ఖాట్మండూ బయలుదేరిన తెలుగు పౌరులు

A. Udaya Shankar.sharma News Editor…పోఖరా నుంచి ఖాట్మండూ బయలుదేరిన తెలుగు పౌరులు

అమరావతి: మంత్రి లోకేష్ చొరవతో నేపాల్ లోని పోఖరా నుండి 10మంది తెలుగుపౌరులు మధ్యాహ్నం 12:40 గంటలకు ప్రత్యేక విమానంలో ఖాట్మండూ బయలుదేరారు. వారంతా 1:15 గంటలకు ఖాట్మండూ చేరుకుంటారు. ఈ మధ్యాహ్నం ఖాట్మండూ నుంచి విశాఖ బయలుదేరే ఇండిగో విమానంలోనే వారిని కూడా రాష్ట్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఖాట్మండూ నుంచి ఏపీ పౌరులను రాష్ట్రానికి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆర్ టి జి ఎస్ వార్ రూమ్ నుంచి మంత్రి లోకేష్ నిర్వహించిన సమీక్షలో డిల్లీ లోని ఏపీ భవన్ ప్రత్యేకాధికారి అర్జా శ్రీకాంత్, మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్, జనసేన నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావు, బండిరెడ్డి రాము, సీనియర్ ఐఏఎస్ అధికారులు ముఖేష్ కుమార్ మీనా, కోన శశిధర్, కాటంనేని భాస్కర్, కృతిక శుక్లా, అజయ్ జైన్, నారాయణ భరత్ గుప్తా, ప్రఖర్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా నేపాల్ నుండి రాష్ట్రానికి రాబోతున్న వారికి స్వాగతం పలికేందుకు కూటమి ప్రజా ప్రతినిధులు ఆయా ఎయిర్ పోర్టులకు చేరుకుంటున్నారు.