భారత్ న్యూస్ విశాఖపట్నం..పీఎం-విద్యా లక్ష్మి యోజన.. హామీ లేకుండానే రూ. 10 లక్షల లోన్
Mar 17, 2026,
పీఎం-విద్యా లక్ష్మి యోజన.. హామీ లేకుండానే రూ. 10 లక్షల లోన్
ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి యోజన కింద విద్యార్థులకు హామీదారులు లేకుండా రూ.10 లక్షల వరకు విద్యా రుణం పొందే అవకాశం ఉంది. ట్యూషన్ ఫీజు, హాస్టల్, పుస్తకాలు, ల్యాప్‌టాప్, జీవన ఖర్చులు అన్నీ ఇందులో కవర్ అవుతాయి. ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం NIRF ర్యాంక్ ఉన్న విద్యాసంస్థల్లో చదివే వారికి వర్తిస్తుంది. వార్షిక కుటుంబ ఆదాయం రూ.4.5 లక్షల లోపు ఉన్నవారికి పూర్తి వడ్డీ రాయితీ, రూ.8 లక్షల వరకు ఉన్నవారికి 3% సబ్సిడీ లభిస్తుంది. అధికారిక పోర్టల్ pmvidyalaxmi.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
