భారత్ న్యూస్ గుంటూరు….దేశంలో ఒక్కొక్కరి తలపై..రూ.1.34 లక్షల అప్పు !
వాస్తవానికి ఈ నిష్పత్తి 2019లో 50 శాతంలోపే ఉంది. ఇక తాజాబడ్జెట్లో జీడీపీలో ద్రవ్యలోటును 4.3 శాతంగా అంచనా వేశారు.
దేశంలోని 147 కోట్ల మంది జనాభాలో ప్రతి ఒక్కరిపై ఈ ఏడాది మార్చి నాటికి రూ.1.34 లక్షల అప్పుంది. ఇది వ్యక్తులు చేసిన అప్పు కాదు!.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రుణం!!. అయినప్పటికీ.. ఈ సంవత్సరం(2026-27) కూడా భారీ స్థాయిలో అప్పులు చేయాల్సి వస్తోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.14.61 లక్షల కోట్ల అప్పులు చేసిన కేంద్రం.. రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ.17.2 లక్షల కోట్ల రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న రుణానికి 17 శాతం ఎక్కువ కావడం గమనార్హం.
2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రూ.53.47 లక్షల కోట్లకు బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇందులో మార్కెట్ నుంచి మొత్తం రూ.17.2 లక్షల కోట్లు సేకరించాల్సి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల వెల్లడించారు.
2025-26 సవరించిన అంచనాల ప్రకారం కేంద్రం మొత్తం అప్పులు రూ.1,97, 18,016 కోట్లు కాగా.. మార్చి 2027 నాటికి ఇది 2,14,82,050 కోట్లకు చేరనుంది.

ఇక జీడీపీలో రుణ నిష్పత్తిని 55.6 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.