భారత్ న్యూస్ రాజమండ్రి ….Ammiraju Udaya Shankar.sharma News Editor…అమరావతి :
🟡ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీం టాస్క్స్
✳️సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ కొరకు Cluster మరియు Pensioners మ్యాపింగ్ ఈ రోజు SS పెన్షన్ పోర్టల్ WEA వారి లాగిన్ నందు క్లోజ్ అవుతుంది. కావున పెన్షన్ల మ్యాపింగ్ లో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే ఈ రోజు అనగా తేదీ:28.08.2025 లోపు పూర్తి చేసుకోండి.
✳️ఎవరైనా కొత్త Users ను యాడ్ చేయాలనుకుంటే వెంటనే వివరాలను పంపి ఎంపీడీఓ గారి ద్వారా యాడ్ చేయించుకోండి.
✳️వికలాంగ శాతం 40% లేదా అంతకంటే ఎక్కువ ఉండి Temporary ఉన్న వారి పెన్షన్ కొనసాగుతుంది. కావున వారికి గతంలో ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకున్నట్లు Withdrawn నోటీసులను ఇచ్చి Acknowledgment కాపీ లను అప్లోడ్ చేయవలెను.
✳️ వికలాంగ శాతం 40% కంటే తక్కువ ఉన్న కారణంగా పెన్షన్ రద్దు అయిన వారికి గతంలో అప్లోడ్ చేసిన నోటీస్ Acknowledgment సరిపోతుంది.
✳️ వికలాంగ శాతం 40% కంటే తక్కువ ఉన్న కారణంగా పెన్షన్ రద్దు అయిన వారిలో ఎవరైనా Widow పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంటే వారికి WEA లాగిన్ నుండి Disable నుండి widow పెన్షన్ Conversion చేసేందుకు ఆప్షన్ ఇవ్వబడినది.దీని ద్వారా పెన్షన్ కన్వర్షన్ కు raise చేయండి. ఎంపీడీఓ గారి అప్రూవల్ తరవాత వారి పెన్షన్ రకం మారుతుంది.
✳️ ఆగస్టు నెల 31 న ఆదివారం కాబట్టి ముందురోజు అనగా శనివారం తేదీ: 30.08.2025 న పెన్షన్ అమౌంట్ డ్రా చేయవలసి ఉంటుంది.
