తమిళనాడులో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు

భారత్ న్యూస్ విజయవాడ…తమిళనాడులో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు

తమిళనాడులోని రాణిపేట్ జిల్లాలో అరక్కోణం-కాట్పాడి మెము ప్యాసింజర్ రైలు శనివారం పట్టాలు తప్పింది.

భారీ శబ్దం వినిపించిందని, వెంటనే లోకో పైలట్ రైలు నిలిపివేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

చిత్తేరి స్టేషన్ నుంచి రైలు బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పిన సమయంలో రైల్వే ట్రాక్‌లో కొంత భాగం విరిగిపోయినట్లు సమాచారం.

ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు.