భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…యోగాంధ్ర – 2025 లో భాగస్వామ్యమైన విక్కుర్తికి సర్టిఫికెట్ ప్రధానం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
యోగాంధ్ర – 2025 లో భాగస్వామ్యమైన ప్రముఖ పారిశ్రామికవేత్త, కూటమి నాయకులు విక్కుర్తి వెంకట శ్రీనివాసరావుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సర్టిఫికెట్ ను ప్రధానం చేశారు.
యోగ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించింది. యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యమైనందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విక్కుర్తి శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలుపుతూ, సర్టిఫికెట్ ను అందజేశారు. సర్టిఫికెట్ తో పాటు కృతజ్ఞతలు తెలుపుతూ, శ్రీనివాస్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సందేశాన్ని పంపింది.
యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యమైన తనకు ముఖ్యమంత్రి సర్టిఫికెట్ ను పంపించడం సంతోషంగా ఉన్నదని ఈ సందర్భంగా విక్కుర్తి అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరు కొంత సమయాన్ని యోగ చేయడానికి సమయాన్ని కేటాయిస్తేనే ప్రభుత్వ ఉద్దేశం నెరవేరుతుందని శ్రీనివాస్ పేర్కొన్నారు. తనతో పాటు యోగ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేశారు.
