భారత్ న్యూస్ విజయవాడ…ఉపాధ్యాయినిని నిలదీసిన తల్లిదండ్రులు
పాఠశాలలో పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పాల్సింది పోయి అసభ్యకర పాఠాలు చెబుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయినిని నిలదీశారు.
ఈ ఘటన శుక్రవారం పీలేరులోని అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది.
గణిత ఉపాధ్యాయిని పరిమిళ విద్యార్థినులపై చులకన భావం ప్రదర్శిస్తున్నారని విద్యార్థినులు, తల్లిదండ్రులు వాపోయారు.
విద్యార్థులకు పాఠాలకు బదులు అసభ్యకర అంశాలను పాఠాల రూపంలో చెబుతున్నారని వారు ఆరోపించారు. పెళ్లికాని యువతులు ఎలా ఉండాలి..
వివాహమైన అనంతరం భర్తతో ఎలా మెలగాలో చెబుతున్న తీరును విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెలిపారు.
ఈ విషయాన్ని పేపర్లో రాసి పాఠశాల ఆవరణంలోని ఫిర్యాదుల బాక్సులో వేశారు. నాలుగు రోజులుగా సెలవులో ఉన్న పరిమిళ శుక్రవారం విధులకు హాజరు కావడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు నిలదీశారు.

ఈ టీచర్ మా పిల్లలకు వద్దంటూ ఆందోళన చేశారు.
గురుకుల ప్రిన్సిపల్ బేబీ కరుణ మాట్లాడుతూ టీచర్ పరిమిళకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని, ఆమె ఇచ్చే సమాధా నాన్ని ఉన్నతాధికారులకు పంపి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.