భారత్ న్యూస్ మంగళగిరి…పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు
నరసరావుపేట పట్టణంలోని స్టేషన్ రోడ్డుపై నిర్మించిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ దిమ్మెను తొలగించాలని కలెక్టర్ కృతికా శుక్లా మునిసిపల్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలను అమలు చేసేందుకు వెళ్లిన మునిసిపల్ అధికారులకు ఆటంకం ఏర్పడింది. సోమవారం అక్కడికి వెళ్లిన వారిని భవన నిర్మాణదారులు అడ్డుకున్నారు. ఓ ప్రజాప్రతినిధి జోక్యంతో మునిసిపల్ సిబ్బంది అక్రమ కట్టడాన్ని తొలగించకుండా వెనుదిరిగారు. మునిసిపల్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ దిమ్మెను తొలగించాలని ఆ శాఖకు సూచించామని టీపీ వో సాంబయ్య తెలిపారు. అక్రమ కట్టడం వాహన రాకపోకలకు అడ్డుగా ఉందని.. కలెక్టర్ కి ఫిర్యాదులు వెళ్లాయని వెల్లడించారు
