.కోడి పందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరం..!

భారత్ న్యూస్ గుంటూరు….కోడి పందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరం..!

కోడిపందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ఉల్లంఘించిన వారిపై ఎంతటి వారైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎంపీడీవో సుధా ప్రవీణ్ హెచ్చరించారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా మండలంలో కోడిపందేలు నిర్వహించకుండా తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

కోడి పందేల నిషేధంపై రాష్ట్ర పశుసంవర్థకశాఖ రూపొందించిన పోస్టర్లను ఎంపీడీవో ఆవిష్కరించారు.

గ్రామాల వారీగా తనిఖీ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. కోడూరు ఎస్సై చాణిక్య, ఏపీఓ రవికుమార్,వెట్నరీ సిబ్బంది,గ్రామ పంచాయతీ కార్య దర్శులు పాల్గొన్నారు.