భారత్ న్యూస్ రాజమండ్రి…అంతర్రాష్ట్ర బదిలీలు కోరుకునే ఉద్యోగులకు ప్రభుత్వం ఆదేశం
ఏపీ-తెలంగాణ మధ్య బదిలీల కోసం మార్చి 31లోగా ఉద్యోగుల వివరాలు ‘నిధి’ పోర్టల్లో అప్డేట్ చేయాలని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పలుమార్లు గడువు పొడిగించినా కొన్ని శాఖలు వివరాలు సమర్పించలేదని, పరిశీలన ప్రక్రియ పూర్తి చేయలేదని పేర్కొన్నారు. అన్ని శాఖల విభాగాధిపతులు బదిలీ కోరుకునే ఉద్యోగుల నుంచి లిఖితపూర్వక హామీ పత్రం తీసుకుని, వివరాలను పోర్టర్లో నమోదు చేసి, ధ్రువీకరించి పంపాలని ఆదేశించారు….
