గడువులోగా చేసిన LRS దరఖాస్తులకే

భారత్ న్యూస్ రాజమండ్రి….గడువులోగా చేసిన LRS దరఖాస్తులకే
అనుమతి

ఏపీలో లేఔట్ క్రమబద్ధీకరణ పథకం( LRS ) నోటిఫికేషన్ జారీ అయిన జులై 26వ తేదీ నుంచి నిర్దేశించిన 90 రోజుల గడువులోగా దరఖాస్తులు చేసుకోనట్లయితే..

ఆ తర్వాత అనుమతించేది లేదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్కుమార్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

దరఖాస్తు చేసిన 45 రోజుల్లోగా చెల్లిస్తే ఫీజు మొత్తంలో 10% రాయితీ, 90రోజుల్లోగా చెల్లిస్తే 5% రాయితీ వర్తిస్తుంది.