పాత ఎడ్లంక వరద ప్రభావిత ప్రాంతలలో పర్యటించిన తెలుగుదేశం నేతలు

భారత్ న్యూస్ మంగళగిరి ….పాత ఎడ్లంక వరద ప్రభావిత ప్రాంతలలో పర్యటించిన తెలుగుదేశం నేతలు

అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక గ్రామంలో వరదల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుగుదేశం నేతలు పరిశీలించి బాధితులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు.
వరద బాధితులకు అవసరమైన సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు వంటి నిత్యావసరాలు అందరికీ అందేలా చూడాలని సూచించారు. వరదల్లో నష్టపోయిన పంటలు, ఆస్తుల వివరాలను నమోదు చేయాలని, ప్రభుత్వ పరంగా తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియజేశారు.ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి అన్ని విధాలా సహాయం అందిస్తుందని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు,పర్చూరి దుర్గాప్రసాద్, బండే రాఘవ,ఘంటశాల రాజమోహన రావు,షేక్ బాబావలి,మేడికొండ విజయ్, కొల్లూరి వాసు తదితరులు పాల్గొన్నారు