భారత్ న్యూస్ విశాఖపట్నం..ఆయిల్ ట్యాంకర్‌లో మంటలు..
విశాఖపట్నం జిల్లా బోయపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఒక ఆయిల్ ట్యాంకర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
డ్రైవర్ క్యాబిన్‌లో షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని రహదారి పక్కన నిలిపివేసి కిందకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది.

స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.