భారత్ న్యూస్ అనంతపురం .. .తెలుగు గంగా కాలువలోకి దూసుకెళ్లిన ఆయిల్ ట్యాంకర్
నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లి గ్రామ పరిధిలోని తెలుగు గంగా కాలువలోకి ఆయిల్ ట్యాంకర్ దూసుకెళ్లింది. ఆదివారం స్థానికుల వివరాల మేరకు.. శనివారం అర్ధరాత్రి కర్నూలు నుంచి విశాఖపట్నం వెళ్లే ఆయిల్ ట్యాంకర్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిందని తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదని తెలిపారు….
