భారత్ న్యూస్ శ్రీకాకుళం….సుప్రీంకోర్టు ఆదేశాలు అనుసరించి ప్రతీజిల్లాకు నోడల్ అధికారిని నియమించాల్సిందే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయితీ కార్యదర్శి లు మరియు టవున్ ప్లానింగ్ అధికారులు అక్రమ భవన నిర్మాణాలు తొలగించు సందర్బంలో ప్రతీ జిల్లాలో కలెక్టర్ స్థాయి జిల్లా నోడల్ అధికారిని నియమించి వారి నుండి ప్రత్యేక అనుమతులు తీసుకొని మాత్రమే అక్రమ నిర్మాణాలు తొలగించాలని గౌరవ సుప్రీంకోర్టు వారు ఆదేశాలు ఇచ్చినప్పటికి సదరు ఆదేశాలు అమలు చేయలేదని సమాచారహక్కు పరిరక్షణ సమైక్య వేదిక సంఘం విచారణలో ఆధారాలతొ సహా తేలింది దీనిపై ప్రతీ జిల్లాకు జిల్లా నోడల్ అధికారిని నియమించాలని ఏపి హైకోర్టు లో ప్రజా ప్రయొజనాల వ్యాజ్యం వేయునున్న సమాచార హక్కు పరిరక్షణ సమైక్య వేదిక
ప్రతీ జిల్లాకు నోడల్ అధికారిని ప్రభుత్వం నియమిస్తె రాజకీయ కక్షలు నేపథ్యంలో వ్యక్తిగత భవనాలు ఏదొ ఒక కారణాలు చెప్పి తొలగించటానికి అవకాశం ఉండదు.అలాగే నిజమైన అక్రమ భవన నిర్మాణాలకు తొలగిస్తామని నోటీసులు జారి తదుపరి చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని చర్యలు తీసుకోకుండా మెల్లకుండి పోతున్న అధికారులకు భవిష్యత్తులో అలా చేయటానికి కుదరదు.

అక్రమ బవన నిర్మాణాలు తొలగింపుకు నోటీసులు ఇచ్చి తదుపరి అవినీతికి పాల్పడుతున్న కొందరు అధికారులకు చెక్ పడినట్లే

ఇట్లు
సమాచారహక్కు పరిరక్షణ సమైక్య వేదిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం & తెలంగాణ రాష్ట్రం