భారత్ న్యూస్ విజయవాడ…బెంగళూరు బ్యాంక్ కాలనిలో దినపత్రిక ఏజెంట్లు తమ పత్రికల బండల్లను విడదీస్తారు.. ఈ విధంగా విడదీసే టప్పుడు కట్ట మీద పలుచటి తెల్లని రంగు పేపర్లను తీసి పక్కన పడేసి పత్రికలను అమర్చుతారు.
అక్కడకు వయోవృద్ధుడైన ఒక వ్యక్తి వచ్చి క్రింద పడేసిన అన్ని తెల్లని రంగుల పేపర్లనూ సేకరించి తీసుకువెళతారు ప్రతిరోజూ ఈ విధంగా వేస్ట్ అని పడేసిన ఈ పేపర్లను తీసుకు వెళ్లి వాటిని నోటు పుస్తకాల కొలతలకు సరిపోయేలాగ కత్తిరించి వాటి నుండి వ్రాసే నోట్ బుక్ లను తయారు చేస్తారు, అనేక నోట్ బుక్ లను తయారు చేసి వీరు మైసూరు రోడ్డులో ఉన్న ప్రభుత్వపాఠశాలలలో పిల్లలకు ఉచితంగా పంచుతుంటారు. ఈయన కనపడితే చాలు పిల్లలు పరుగులు తీసుకుంటూ వచ్చి,, నోట్ బుక్ తాత అంటూ ముద్దాడతారు. ఈ పెద్దాయన పేరు మోహన్. ఐ.టి.ఐ కంపెనీ ఉద్యోగి . పాఠశాల పిల్లలకు విశిష్టమైన మంచిపని చేస్తున్న ఇతడు నిజంగానే అందరికి ఆదర్శం.
