గ్రంథాలయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

భారత్ న్యూస్ గుంటూరు…గ్రంథాలయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు

గ్రంథాలయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు కోరారు. శుక్రవారం అవనిగడ్డలోని గ్రేడ్-1 గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభయ్యాయి. ముఖ్యఅతిథిగా విచ్చేసిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు, యువత ప్రతి ఒక్కరు గ్రంథాలయాలకు వచ్చి విజ్ఞాన సర్వస్వాన్ని తెలుసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా బాల బాలికలు జాతీయ నాయకుల వేషధారణలో అలరించారు. ఎంపీపీ తుంగల సుమతి, కొండవీటి ఈశ్వరరావు, గ్రంథాలయ అధికారి ప్రభ పాల్గొన్నారు.