భారత్ న్యూస్ గుంటూరు….తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన ఎన్టీఆర్.

Ammiraju Udaya Shankar.sharma News Editor…దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు తెలుగు జాతిఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారని ప్రముఖ పారిశ్రామికవేత్త, కూటమి నాయకులు విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు కొనియాడారు.
అవనిగడ్డలోని ఒకటవ వార్డులో గల విక్కుర్తి కార్యాలయంలో ఆదివారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 30 వ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ ప్రతిమకు విక్కుర్తి శ్రీనివాస్ తో పాటు పలువురు పూలమాలలతో నివాళులు అర్పించారు.

విక్కుర్తి రాంబాబు ఏర్పాట్లను పర్యవేక్షించగా, కార్యక్రమంలో న్యాయవాది విక్కుర్తి రామకృష్ణ, పులిగడ్డ చంద్ర, బర్మా శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గోగినేని సోమశేఖరరావు, పోతన ఆంజనేయులు, కనకమేడల రామబ్రహ్మం, మాజీ ఎంపీటీసీ సభ్యులు కర్రా సుబ్బారావు, పోతన రమేష్, అంబటి నాగరాజు, దేవనబోయిన వెంకటేశ్వరరావు, రేపల్లె ఈశ్వరరావు, తిమ్మన వెంకట కార్తీక్, భూపతి నాంచారయ్య, ఎస్ పున్నయ్య చౌదరి, భూపతి సాంబశివరావు, బొప్పన రమణ, భూపతి బాబురావు లతో పాటు పెద్ద సంఖ్యలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.