పెద్దల సభకు నితీశ్.. బీహార్‌కు ఇక బీజేపీ ముఖ్యమంత్రి!

భారత్ న్యూస్ అనంతపురం.పెద్దల సభకు నితీశ్.. బీహార్‌కు ఇక బీజేపీ ముఖ్యమంత్రి!

జేడీయూ అధినేత, బీహార్‌ ముఖ్యమంత్రి Conversation రాజ్యసభకు పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. రికార్డు స్థాయిలో 2005 నుంచి 10 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నితీశ్‌ త్వరలో బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడనుందని అన్నారు.

దీంతో బీహార్‌లో మొదటిసారిగా బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారు. అధికార ఎన్డీయే కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉన్నప్పటికీ పొత్తు ధర్మం పాటిస్తూ నితీశ్‌ను సీఎం పదవిలో కొనసాగించింది.