వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేకపోయినా కొత్త రేషన్ కార్డులు జారీ

భారత్ న్యూస్ శ్రీకాకుళం….Ammiraju Udaya Shankar.sharma News Editor…వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేకపోయినా కొత్త రేషన్ కార్డులు జారీ

కాకినాడ జిల్లా జగ్గంపేట మే 15: స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, మండల టిడిపి అధ్యక్షులు మారిశెట్టి భద్రం, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే అయితే వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కావాలని ప్రభుత్వ నిబంధన విధించడంతో అందరూ చాలా ఇబ్బంది గురవుతున్నారని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, రాష్ట్రంలో శాసనసభ్యులు కూడా ఈ విషయం వల్ల అందరికీ మ్యారేజ్ సర్టిఫికెట్స్ తీసుకోవడం ఖర్చుతో కూడుకున్న విషయంగా పరిగణించి దీనిని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని అందులో భాగంగా కొత్త కార్డులు తీసుకునేవారు మ్యారేజ్ సర్టిఫికెట్ దరఖాస్తు తో పొందు పరచవలసిన అవసరం లేదని వీఆర్వో సర్టిఫై చేస్తే సరిపోతుందని తెలియజేశారు. ప్రభుత్వం ట్రాన్స్ జెండర్ కూడా కొత్త కార్డులు జారీ చేస్తుందని టిడిపి నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి ప్రధాన కార్యదర్శి రేఖ బుల్లి రాజు, టిడిపి విభిన్న ప్రతిభవంతుల జిల్లా అధ్యక్షులు మండపాక అప్పన్న దొర, జగ్గంపేట టౌన్ తెలుగు యువత అధ్యక్షులు కొండ్రోతు శ్రీను, క్లస్టర్ కో కన్వీనర్ కొల్లు రామకృష్ణ, దాట్ల సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.