భారత్ న్యూస్ విశాఖపట్నం..ఇక పై ఉపాధి హామీ పథకంలో 48 గంటల్లో కొత్త జాబ్ కార్డు
ఏపీలో ఉపాధి హామీ పథకం కింద కొత్త జాబ్ కార్డుల జారీ, బోగస్ కార్డుల తొలగింపునకు ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది.
ఈకేవైసీ ప్రక్రియతో అధికారులు 7.44 లక్షల బోగస్ కార్డులను గుర్తించి రద్దు చేశారు.తొలగించిన కార్డుల వివరాలను గ్రామాల్లో వారం రోజులు ప్రదర్శిస్తారు.

కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి 48 గంటల్లో కార్డులు మంజూరు చేస్తారు. ఈ ఏడాది కొత్తగా 3.47 లక్షల మందికి ప్రభుత్వం జాబ్ కార్డులు ఇచ్చింది.