కొత్త డ్వాక్రా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్,

భారత్ న్యూస్ గుంటూరు….కొత్త డ్వాక్రా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్

ఒక్కో సంఘానికి రూ.15 వేలు.

నూతనంగా ఏర్పాటయిన డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రూ.3 కోట్ల రివాల్వింగ్ ఫండ్ ను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2 వేల కొత్త డ్వాక్రా సంఘాలకు రూ.15 వేల చొప్పున అందించనున్నారు. ఈ మొత్తాన్ని ఆయా సంఘాల సభ్యులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. సంఘం ఖాతాలోనే నిల్వ ఉంటుంది. సంఘం నిధి పెంచేందుకు, సభ్యుల అవసరానికి అనుగుణంగా అంతర్గతంగా అప్పులు మంజూరు చేసుకునేందుకు, బ్యాంకుల ద్వారా ఎక్కువ మొత్తంలో సంఘానికి రుణం మంజూరయ్యేందుకు రివాల్వింగ్ ఫండ్ ఉపయోగపడుతుంది. త్వరలో సంఘాల ఖాతాల్లో నిర్దేశిత మొత్తం జమ కానుంది. ఆయా సంఘాల జాబితాను ఇప్పటికే జిల్లాలకు పంపగా తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశిస్తూ మంగళ వారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.