అమరావతి :
భారత్ న్యూస్ రాజమండ్రి…ఏపీలో కొత్త జిల్లాలు ఇవే.. నేడు మరోసారి సీఎంతో మంత్రివర్గ ఉప సంఘం భేటీ !!
అమరావతి :
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దుల మార్పులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం ఆమోదం తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంతో రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు అంశం తాజాగా తెరమీదకు వచ్చింది. పరిమిత స్థాయిలోనే మార్పులు, చేర్పులు ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

అయితే రంపచోడవరం, చింతూరు డివిజన్లను కలపకుండా కొత్త జిల్లా ఏర్పాటు చేయడమే మంచిదని మంత్రివర్గ ఉప సంఘానికి సీఎం సూచనలు చేశారు. జిల్లాల సరిహద్దుల మార్పు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మరికొన్ని సూచనలు సీఎం చేశారు. సీఎం సూచనలకు అనుగుణంగా మరో నివేదికతో మంత్రివర్గ ఉప సంఘం రూపొందించనుంది. దానిపై సీఎం అధ్యక్షతన నేడు ( నవంబర్ 25, 2025 )మరోమారు సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నారు