భారత్ న్యూస్ గుంటూరు…..Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో నూతన డిఫెన్స్ పాలసీ – 15 వేల ఎకరాలు సేకరణకు నిర్ణయం
త్వరలోనే నూతన డిఫెన్స్ పాలసీ తీసుకురానున్న ఏపీ ప్రభుత్వం – రక్షణ రంగంలో రూ. 30 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
త్వరలో ల్యాండ్ సేకరణ లో దొనకొండ (ప్రకాశం జిల్లా)
రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రక్షణ రంగంలో పెట్టుబడులకు కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. 30,000 కోట్ల రూపాయల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా త్వరలోనే నూతన డిఫెన్స్ పాలసీని ప్రకటించనుంది. నాలుగు రక్షణ రంగ పారిశ్రామిక నోడ్లు ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాలు దానిలో పొందుపరిచింది.
30 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని నిర్దేశించింది. పెట్టుబడులతో వచ్చే పరిశ్రమల కోసం సుమారు 15,000 ఎకరాలను సేకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది
నాలుగు రక్షణ రంగ నోడ్లు: రాష్ట్రంలో నాలుగు రక్షణ రంగ పారిశ్రామిక నోడ్ల అభివృద్ధికి కొత్త పాలసీలో మార్గదర్శకాలను ప్రభుత్వం సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అనంతపురం జిల్లా లేపాక్షి నుంచి కర్నూలు జిల్లా ఓర్వకల్ మధ్య భారీ నోడ్ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. దీన్ని జాతీయ రహదారికి
