భారత్ న్యూస్ శ్రీకాకుళం….. .ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు నార్కో టెస్ట్?
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు నార్కో టెస్ట్?
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితులకు నార్కో టెస్ట్ చేయించాలని సిట్ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులతో చర్చించి వారి సూచనల మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. కోర్టు అనుమతి ఇస్తే లిక్కర్ స్కామ్ నిందితులు రాజ్ కసిరెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గోవిందప్పకు నార్కో టెస్ట్‌లు చేయనున్నారు.
