అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతపాలెంలో మంత్రి నారా లోకేశ్ పర్యటించారు..

భారత్ న్యూస్ విశాఖపట్నం..అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతపాలెంలో మంత్రి నారా లోకేశ్ పర్యటించారు..

ఇక్కడ రూ. 2,300 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఆయన శంకుస్థాపన చేశారు. రాంబిల్లి ఇండస్ట్రియల్ పార్కులో 102 ఎకరాల్లో ఈ యూనిట్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా సుమారు 1,750 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. 2028-29 నాటికి పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించేలా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం వేగవంతం చేస్తోంది..