చిట్టూర్పులో ఆహ్లాదంగా జరుగుతున్న మురళీ కోలాటం పోటీలు

భారత్ న్యూస్ విశాఖపట్నం..చిట్టూర్పులో ఆహ్లాదంగా జరుగుతున్న మురళీ కోలాటం పోటీలు

చిట్టూర్పు – ఘంటసాల :-

ఘంటసాల మండలం చిట్టూర్పు గ్రామంలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో జరుగుతున్న కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు జిల్లాల స్థాయి మురళీ కోలాటం పోటీలను మంగళవారం ఆహ్లాద వాతావరణంలో పోటా పోటీగా సాగాయి.

ఈ వివిధ ప్రాంతాల నుంచి మూడు మురళీ కోలాటం బృందాలు పాల్గొనగా కోసూరివారిపాలెం గ్రామానికి చెందిన శ్రీ అనంత కోటి మురళీ కోలాట సమాజం అద్భుతమైన ప్రదర్శన చేసి భక్తుల, ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.

అలాగే తాళం భజన పోటీలు కూడా కొనసాగుతున్నాయి.

కొడాలి పీఏసీఏస్ ఛైర్పర్సన్ గుత్తికొండ ప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా పడుగు ప్రభాకర్, పి.శ్రీనివాసరావులు వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో దాసరి సతీష్, యలవర్తి వంశీ, వేములపల్లి సుధీర్, పరుచూరి వెంకటేశ్వరరావు, వాకా రాకేష్, గుత్తికొండ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.