ఈనెల 26 పోలీస్ స్టేషన్ ముట్టడికి ఎంఆర్పీఎస్ పిలుపు :

భారత్ న్యూస్ మంగళగిరి…ఈనెల 26 పోలీస్ స్టేషన్ ముట్టడికి ఎంఆర్పీఎస్ పిలుపు :

ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం : రెడ్డిగూడెం మండల పోలీస్ స్టేషన్ ఎస్ ఐ మోహనరావు మాదిగల పట్ల అనుసరిస్తున్న పక్షపాత వైఖరిని నిరసిస్తూ ఈ నెల 26 వ తేదీన రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ ముట్టడికి పిలుపు ఇస్తున్నట్లు ఎంఆర్పీఎస్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఎ నాగమల్లేశ్వరరావు తెలిపారు. రెడ్డిగూడెం ఎస్సీవాడ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో అతి పెద్ద మాదిగ పల్లె అయిన రెడ్డిగూడెంలో కొందరు అగ్రవర్ణ నాయకుల మెప్పు కోసం ఛైతన్య వంతులైన మాదిగ యువకులు, పెద్దల పట్ల ఎస్ ఐ మోహనరావు అనుసరిస్తున్న అప్రజాస్వామ్య వైఖరిని పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి 20 రోజులు కావస్తున్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదనీ, దానికి నిరసనగా, ఎస్ ఐ మోహనరావు మాదిగల పట్ల అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ 26 వ తేదీన రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ ముట్టడికి ఎంఆర్పీఎస్ పిలుపు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ మందా పిచ్చయ్య, ఎంఆర్పీఎస్ మైలవరం నియోజకవర్గ ఇంచార్జీ ఇంకొల్లు జమలయ్య, సీనియర్ నాయకులు మండూరి నాగేశ్వరావు,ఏసు రత్నం, సుందరం, రామారావు తదితరులు పాల్గొన్నారు.