భారత్ న్యూస్ రాజమండ్రి….అవనిగడ్డ లో విపరీతంగా పెరిగిన దోమల వలన అవనిగడ్డ ప్రజలు తరచూ అనారోగ్యానికి గురవుతున్న సమస్యను గుర్తించిన వైసీపీ యువనేత గౌతమ్, అవనిగడ్డ గ్రామ పంచాయతీ వారు వెంటనే అవనిగడ్డ లో దోమల మందు పిచికారీ చేసి సమస్యను పరిష్కరించాలని అవనిగడ్డ గ్రామ పంచాయితీ ఈఓ మరియు సంభందిత అధికారులను కోరిన మీదట సమస్య తీవ్రత పట్ల వెంటనే స్పందించి అవనిగడ్డలో దోమల నివారణ నిమిత్తం ఈరోజు రాత్రి దోమల మందు స్ప్రే చేయించటమే కాక సమస్య ను పరిష్కరిస్తున్నట్లు గౌతమ్ కు తెలియపరిచి వృత్తి పట్ల వారి నిభద్ధతను సక్రమంగా నెరవేర్చి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసిన అవనిగడ్డ EOPRD- అప్పల నరసమ్మ గారు, EO- శ్రీనివాసరావు గారు, అవనిగడ్డ పంచాయితీ పారిశుధ్య కాంట్రాక్టర్ వీరంకి అమర్ గారి పనితీరు పట్ల గౌతమ్ హర్షం వ్యక్తం చేస్తూ ప్రజాసమస్యల పట్ల ఎల్లప్పుడూ అధికారులు ఈ విధంగానే వెంటనే స్పందించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
గౌతమ్ కోరిన వెంటనే సమస్య తీవ్రత పట్ల వెంటనే స్పందించిన అవనిగడ్డ గ్రామ పంచాయితీ మరియు అధికారుల పని తీరు పట్ల గ్రామ ప్రజలు తమ హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ నీటి సంఘ అధ్యక్షులు వర్రే బసవరావు, గళ్ళా జితేంద్ర, అద్దంకి శేషు మరియు ఇతర పంచాయితీ శిబ్బంది పాల్గొన్నారు.