భారత్ న్యూస్ విజయవాడ…మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే తనయుడు
అత్యవసర స్థితిలో ఉన్న వ్యక్తి కోసం విజయవాడ వెళ్లి రక్తదానం చేసిన మండలి వెంకట్రామ్ (రాజాబాబు)
రాజకీయమంటే అధికారం కాదు, అపదలో ఉన్న సాటి మనిషిని ఆదుకునే బాధ్యత అని నిరూపించారు మన అవనిగడ్డ నియోజకవర్గ యువనేత మండలి వెంకట్రామ్ (రాజా బాబు) గారు.
తన తండ్రి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారి అడుగుజాడల్లో నడుస్తూ, నిత్యం ప్రజా సేవలో నిమగ్నమై ఉండే ఆయన, తనలోని గొప్ప మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. కొత్తపేట గ్రామానికి చెందిన చందన శ్రీనివాసరావు అనే వ్యక్తికి గుండె ఆపరేషన్ నిమిత్తం అత్యవసరంగా AB+ve రక్తం అవసరమని మన అవనిగడ్డ బ్లడ్ డోనార్స్ గ్రూప్ నిర్వాహకుల ద్వారా తెలిసిన వెంటనే, తన బిజీ షెడ్యూల్‌ను పక్కన పెట్టి హుటాహుటిన విజయవాడకు బయలుదేరారు. ఏమాత్రం తటపటాయించకుండా స్వయంగా రక్తదానం చేసి, ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టడంలో భాగస్వాములయ్యారు.
నాయకుడంటే వేదికల మీద ఉపన్యాసాలు ఇచ్చేవాడు మాత్రమే కాదు, కష్టంలో ఉన్న కార్యకర్త కోసం, సామాన్యుడి కోసం తన రక్తాన్ని సైతం ధారబోసేవాడని రాజా బాబు గారు నిరూపించారు.
ఆయన చూపిన ఈ సమయస్ఫూర్తి, సాటి మనిషిపై ఉన్న మమకారం నేటి యువతకు ఒక గొప్ప సందేశం.
ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడంలోనే నిజమైన తృప్తి ఉందనే విషయాన్ని ఆయన తన చేతలతో చూపించారు.
సామాజిక బాధ్యతను గుర్తెరిగి, ప్రాణదాతగా నిలిచిన రాజా బాబు గారి సేవా నిరతికి మనందరం గర్విద్దాం.

మీ ఉదారత మరెందరికో స్ఫూర్తిదాయకం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం.