మిషన్ వాత్సల్య’ పథకం..అనాథ పిల్లలకు నెలకు రూ.4 వేలు..

భారత్ న్యూస్ విశాఖపట్నం..మిషన్ వాత్సల్య’ పథకం..అనాథ పిల్లలకు నెలకు రూ.4 వేలు..

ఆంధ్రప్రదేశ్, లో కూటమి ప్రభుత్వం మరో పథకం అమలు చేయబోతోంది. తల్లిదండ్రులు లేని పిల్లలకు, ఇతర కారణాల వల్ల అనాథలైన పిల్లలకు ‘మిషన్ వాత్సల్య’ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ వాటాలో ఆర్థిక సాయం అందించనుంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ పథకం ద్వారా పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు నెలకు రూ.4 వేలు ఇస్తారు. అంటే ఏడాదికి రూ.48 వేలు వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని సరిగా అమలు చేయలేదనే విమర్శలు ఉన్నాయి..