భారత్ న్యూస్ గుంటూరు…13 ఏళ్లయినా మహిళ మిస్సింగ్ కేసు చేధించలేదా?: హైకోర్టు అసహనం
జీలుగుమిల్లి (M) కామయ్య పాలెంకు చెందిన మంగాదేవి అదృశ్యం కేసు విషయంలో పోలీసుల తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
మిస్సింగ్ కేసు నమోదై 13 ఏళ్లు అవుతోందని, శాస్త్రీయ పద్దతిలో విచారణ చేసి ఉంటే ఆమె ఆచూకీ కనుగొనేందుకు ఇంత కాలం పట్టేది కాదని వ్యాఖ్యానించింది.
ఈ కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించడం మంచిదని అభిప్రాయపడింది. కేసు దర్యాప్తు వివరాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్పీని ఆదేశించింది~£
