భారత్ న్యూస్ శ్రీకాకుళం….రూ.3.21 కోట్లు కొట్టేశారు
గుడివాడలోని ఉద్యోగుల సహకార సంఘంలో నిధుల దుర్వినియోగం
బినామీ పేర్లతో తీసుకున్న రుణాలు రూ.3.21కోట్లు
తిరిగి చెల్లించింది రూ.14.24 లక్షలు
గుడివాడ మున్సిపాలిటీలో ‘రుణ’ మోసాలపై నివేదిక సిద్ధం
రూ.3.07 కోట్లను 18శాతం వడ్డీతో రికవరీ చేయాల్సిందే..
మాజీ కమిషనర్ తో పాటు 14 మందిపై చర్యలకు సిఫార్సు
11 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నివేదిక..
సహకార సంఘం ప్రతినిధులతో చేతులు కలిపిన కేడీసీసీబీ అధికారులు…
విజయవాడ: సహకార సంఘానికి ప్రాతినిధ్యం వహించిన వారు, కేడీసీసీబీ అధికారులు, సిబ్బంది కలిసి మొత్తం రూ.3.21 కోట్లను దుర్వినియోగం చేశారని సహకార శాఖ అధికారులు నిర్ధారించారు. మున్సిపల్ ఉద్యోగుల సహకార పరపతి సంఘంలో జరిగిన రుణాల దుర్వినియోగంపై సహకార శాఖ అధికారులు విచారణ చేశారు.
ఆ నివేదిక కొద్దిరోజుల క్రితం ఉన్నతాధికారులకు చేరింది. మున్సిపల్ మాజీ కమిషనర్ పి. సంపత్ కుమార్ తోపాటు 14 మందిపై చర్యలు తీసుకోవాలని నివేదిక స్పష్టం చేసింది. 11 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పేర్కొంది. బినామీ పేర్లతో రుణాలను పొందడంతో మున్సిపల్ అధికారులు, సహకార పరపతి సంఘం ప్రతినిధులు, ఉద్యోగులు, కేడీసీసీబీ అధికారులు, సిబ్బంది పాత్ర ఉందని నిర్ధారించింది.
*బాధ్యులు వీరే…₹
మున్సిపల్ ఉద్యోగుల సహకార పరపతి సంఘంలో బినామీ రుణాల వ్యవహారంలో ఎవరెవరిపై ఎలాంటి
చర్యలు తీసుకోవాలో విచారణ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. పరపతి సంఘం మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుతం ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తున్న దనాల లక్ష్మి. పరపతి సంఘంలో గుమస్తాగా పనిచేస్తున్న కొమ్మనబోయిన వెంకటరమణ రాజు, గుడివాడ కేడీసీసీబీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మాతూరి శ్రీనివాస్, నాడు పాసింగ్ ఆపీసర్ గా పనిచేసి ప్రస్తుతం ఉద్యోగానికి రాజీనామా చేసిన ఎల్.అనూష కోడూరు కేడీసీసీ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ ఆర్,రాజ్యలక్ష్మి, ఇప్పుడు గుడివాడలో కేడీసీసీ బ్యాంక్ బజార్ బ్రాంచ్ మేనేజర్ మేడిశెట్టి సాంబశివరావు, ముదినేపల్లి కేడీసీసీబీ అసిస్టెంట్ మేనేజర్ యతీంద్ర లక్ష్మీకుమారి, గుడివాడ కేడీసీసీబీలో ఇన్స్పెక్షన్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్న ఓగిపోయిన సంధ్యపై బీఎన్ఎస్లోని 314, 316, 336, 336(3), 340, 344 ప్రకారం కేసు నమోదు చేయాలని నివేదికలో పేర్కొన్నారు. మాజీ అసిస్టెంట్ మేనేజర్ సుండు నాగేంద్ర, ముదినేపల్లిలో కేడీసీసీ బ్యాంక్ మేనేజర్గా వ్యవహరిస్తున్న సీహెచ్పీ రమేష్ నాయుడు, విశాఖపట్నంలోని డీసీసీబీ ఆనందపురం శాఖ అసిస్టెంట్ మేనేజర్ ఆదిరాజు ఎస్వీఎస్ఎన్ లక్ష్మిపై బీఎన్ఎస్ 314, 316, 344 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని నివేదికలో స్పష్టం చేశారు.ఇవీ నివేదికలోని సిఫార్సులు
2014లో రూ.7.50 లక్షలను బినామీ పేర్ల మీద రుణాలు తీసుకున్నారు. దీనికి మాజీ అధ్యక్షురాలు ధనాల లక్ష్మి, గుమస్తా కొమ్మనబోయిన వెంకట రమణరాజు, రిటైర్డ్ అసిస్టెంట్ మేనేజర్ ఎస్. నాగేంద్రబాబు, అసిస్టెంట్ మేనేజర్ సీహెచ్పీ రమేష్ నాయుడు బాధ్యులు, వారి నుంచి ఈ మొత్తాన్ని 18శాతం వడ్డీతో వసూలు చేయాలి.
2017లో రూ.18 లక్షలను బినామీ రుణాలుగా తీసుకున్నారు. దీని నుంచి రూ.2,24,570లు తిరిగి వసూలు చేశారు. సహకార సంఘం మాజీ అధ్యక్షురాలు ధనాల లక్ష్మి, గుమస్తా కొమ్మనబోయిన వెంకట రమణరాజు, రిటైర్డ్ ఆసిస్టెంట్ మేనేజర్ ఎస్.నాగేంద్రబాబు, అసిస్టెంట్ మేనేజర్ పాసింగ్ ఆఫీసర్ ఆర్.రాజ్యలక్ష్మిపై నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేదు. ఈ మొత్తాన్ని వారి నుంచి 18శాతం వడ్డీతో వసూలు చేయాలి.
2021లో రూ.91,80లక్షలను బినామీ రుణాలుగా తీసుకున్నారు. ఇందులో నుంచి రూ.5,72,505 వసూలు చేశారు. ధనాల లక్ష్మి, వెంక టరమణ రాజు, సూపర్వైజర్ ఏఎస్వీఎస్ నాగలక్ష్మి, మేనేజర్ ఎం.సాంబశివరావు, పాసింగ్ ఆఫీసర్ యతీంద్ర లక్ష్మీకుమారి, స్టాఫ్ అసిస్టెంట్ ఓగిపోయిన సంధ్యపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ మొత్తాన్ని 18శాతం వడ్డీతో వసూలు చేయాలి.
2022లో రూ.1.81కోట్ల బినామీ రుణాలు పొందారు. ఇందులో నుంచి రూ.6,27,680 వసూలు చేశారు. ధనాల లక్ష్మి, వెంకటరమణ రాజు, నాగలక్ష్మి, సాంబశివరావు, లక్ష్మీకుమారి, సంధ్యపై చర్యలు తీసు కోవాలి. ఆ మొత్తాన్ని 18శాతం వడ్డీతో వసూలు చేయాలి.
దనాల లక్ష్మి, వెంకటరమణ రాజు కలిసి రూ.22,64,441లను దుర్వినియోగం చేశారు. దుర్విని యోగమైన తేదీ నుంచి ఈ మొత్తాన్ని 18శాతం వడ్డీతో వసూలు చేయాలి.
భాగస్వామి మూలధనంగా సంఘంలోని సభ్యుల నుంచి రూ.95,750 వసూలు చేసినా ఈ డబ్బుల వివరాలు క్యాష్ బుక్ లో నమోదు కాలేదు. ధనాల లక్ష్మి, వెంకటరమణ రాజు నుంచి ఈ మొత్తాన్ని 18శాతం వడ్డీతో వసూలు చేయాలి.
నాలుగు సంవత్సరాల పాటు బినామీ బాగోతం

ఉద్యోగుల సహకార పరపతి సంఘంలోని నేతలు బినామీ పేర్లతో నాలుగేళ్ల పాటు రుణాలు తీసుకున్నారు. 2014, 2017, 2021, 2022 బినామీ పేర్లతో రుణాలు పొందారు. మొత్తం రూ.3.21,90,191లను వేర్వేరు వ్యక్తుల పేర్ల మీద రుణాలుగా తీసుకున్నారు. ఇందులో నుంచి