భారత్ న్యూస్ గుంటూరు…..Ammiraju Udaya Shankar.sharma News Editor…మల్లేశ్వరరావు గారిని, వారి కుటుంబాన్ని వైయస్ జగన్ గారి ఆదేశాల మేరకు పరామర్శించడం జరిగింది. ఆ కుటుంబం అట్టడుగు వర్గం నుంచి ప్రజాపక్షాన నిలిచిన రాజకీయ చైతన్యవంతమైన కుటుంబం. దుర్మార్గంగా జరిగిన దాడి వల్ల ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మృత్యుంజయుడిగా బయటకు వస్తారని మేం ఆశిస్తున్నాం. ఇది ఫ్యాక్షన్ గొడవో, కుటుంబ కలహాలో కాదు, కేవలం రాజకీయపరమైన హత్యే. తెలుగుదేశం పార్టీ నాయకుడు నరేంద్ర రెచ్చగొట్టి హత్యకు పురిగొల్పుతూ ఉన్న వీడియోను ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. నిందితులను తప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు.
-సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్…..
