అవనిగడ్డలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘరానా మోసం,

భారత్ న్యూస్ విజయవాడ…అవనిగడ్డ నియోజకవర్గం

అవనిగడ్డలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘరానా మోసం

డ్వాక్రా మహిళల డబ్బు సుమారు 25 లక్షల రూపాయలు కాజేసీ ఊరు నుంచి కుటుంబంతో సహా పారిపోయిన అవనిగడ్డ లంకమ్మ మాన్యం కాలనీకి చెందిన బుక్ కీపర్ విశ్వనాథపల్లి నాగమల్లేశ్వరి.

లంకమ్మ మాన్యంకు చెందిన భాగ్యశ్రీ, యాసిన్, మరియమ్మ గ్రూపు సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి డ్వాక్రా మహిళల సొమ్ముతో ఉడయించిన నాగమల్లేశ్వరి

గత నెల 12వ తారీకు అవనిగడ్డ నుంచి కుటుంబంతో సహా పరారైన నాగమల్లేశ్వరి

తమ సమస్యను కలెక్టర్ గారి దృష్టికి తీసుకు వెళ్లి అవనిగడ్డ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు తమకు ఎలాంటి న్యాయం జరగలేదంటూ వాపోతున్న బాధితులు

స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ దృష్టికి కూడా వారి సమస్యను తీసుకువెళ్లామని ఆమె తమ డబ్బుతో పరారై నెల రోజులు అవుతున్నా తమకు ఎలాంటి న్యాయం జరగలేదంటూ మీడియాను ఆశ్రయించిన బాధితులు

డ్వాక్రా రుణాలకు సంబంధించి ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకుకు మార్చాలని ఒక్కొక్కరి దగ్గర 20000 రూపాయలు వసూలు చేసిందని గ్రూపులో కొత్తవారు చేరాలంటే వారి వద్ద నుండి 35 వేల రూపాయలు తీసుకొని గ్రూపులో చేర్చిందని ఇలాంటి దారుణాలకు పాల్పడిన నాగమల్లేశ్వరిపై వెంటనే చెవిలో తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న బాధితులు

కూలి నాలి చేసుకుని రెక్కల కష్టం మీద బతికే మాలాంటి వారిని మోసం చేసి పరారైన నాగమల్లేశ్వరి ఆచూకీ వెంటనే కనిపెట్టి తమకు న్యాయం చేయమంటూ మీడియా ముందు వారి బాధను వ్యక్తం చేసిన బాధితులు

అధికారులు తమకు న్యాయం చేసే అంతవరకు బ్యాంకులకు తాము తీసుకున్న రుణాలు చెల్లించమంటూ వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్న బాధితులు.