కృష్ణా జిల్లాను మోడల్ జిల్లాగా కాదు, మాఫియా జిల్లాగా మారుస్తుంది ఈ కూటమి ప్రభుత్వం

భారత్ న్యూస్ విశాఖపట్నం..కృష్ణా జిల్లాను మోడల్ జిల్లాగా కాదు, మాఫియా జిల్లాగా మారుస్తుంది ఈ కూటమి ప్రభుత్వం

      - వైసీపీ యువనేత గౌతమ్

మంత్రి కొల్లు రవీంద్ర గారు మొన్న అవనిగడ్డలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కృష్ణా జిల్లా ప్రతిష్టను గత ప్రభుత్వం నాశనం చేసింధని ఆరోపించటం హాస్యాస్పదంగా ఉందని వైసీపీ నేత గౌతమ్ తెలిపారు.

పి4, విజన్ 2047 విజయాలకు కేంద్రంగా కృష్ణా జిల్లాను మారుస్తాo అంటున్న టీడీపీ నేత రవీంద్ర గారు,
టీడీపీ కనీసం అవనిగడ్డ నియోజకవర్గానికి ఇప్పటికీ టీడీపీ తరఫున ఒక ఇన్‌చార్జ్‌ను కూడా నియమించలేక పోయిందని, 2047 కైనా ఇంచార్జ్ ను నియమిస్తారో లేదో టీడీపీ కే తెలియదని గౌతమ్ అన్నారు…,

కృష్ణా జిల్లా అభివృద్ధి ముసుగులో మాఫియా గడ్డగా మారిపోయిందని,
కృష్ణా జిల్లాను మోడల్ జిల్లాగా మారుస్తాం అంటూ ప్రచారం చేసుకుంటున్న మంత్రి కొల్లు రవీంద్ర గారు మొదట స్వయంగా పోలీసులే చెప్పిన వాస్తవాలను ఓసారి గమనించాలని, సాక్షాత్తు అవనిగడ్డ డీఎస్పీ గారు మీడియా సమావేశంలో బహిరంగంగా “అధిక హోదాలో ఉన్న వ్యక్తులు మట్టి, బియ్యం, మద్యం మాఫియాలను అడ్డుకునే ప్రయత్నాలను నిలిపివేయమంటూ బెదిరింపు ధోరణిలో ఫోన్ కాల్స్ చేస్తున్నారంటూ” చెప్తుండగా మీరేమో జగన్ ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ను ల్యాండ్, శాండ్, వైన్, మైన్ కుంభకోణాలతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారనటం ఏమాత్రం సబబు కాదని గౌతమ్ తెలిపారు…,

ముఖ్యంగా అవనిగడ్డ నియోజకవర్గంలో డీఎస్పీ స్థాయి ఆఫీసర్లకు బెదిరింపు ధోరణిలో ఫోన్ కాల్స్ చేస్తూ మాఫియాను నడిపిస్తుంటే ఇంకా ‘పి4, విజన్ 2047’ అంతా బూటకపు మాటలేనని, మీ పాలనలో పోలీసులు కూడా బెదిరింపు మాట చెబుతున్నారంటే, మరి మీరు చెప్పే అభివృద్ది ఎలా సాధ్యమని, మీ ప్రభుత్వ పని తీరు మాఫియాల కోసమా? ప్రజల కోసమా? అని గౌతమ్ ప్రశ్నించారు….,

అవనిగడ్డ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రజలు చూస్తున్న వాస్తవాలు ఏమిటంటే రోజూ అక్రమంగా తరలిస్తున్న మట్టితో కూడిన ట్రాక్టర్లు, మద్యం సింగిల్ సేల్స్‌తో ఉన్న వైన్ షాపులు, బియ్యం అక్రమ రవాణాతో వాహనాలు, రైతు బజార్లలో నిర్ణయించిన ధరల కన్నా అధిక రేట్లు.
ఇవన్నీ మీ అభివృద్ధి రిపోర్ట్ కార్డులో ముద్రించాలని మీరు అనుకుంటున్నారా అని గౌతమ్ ప్రశ్నించారు…,

వైసీపీపై “కుల-మత” రాజకీయాల ఆరోపణలు చేయడాన్ని మీరు మానేయాలని,
తెలుగుదేశం పార్టీ చరిత్రలో దళితులపై దాడులు మరియు మైనారిటీలకు ఎప్పడు టీడీపీ వ్యతిరేకంగానే నడిచిందని ఇవన్నీ ప్రజలకు గుర్తున్నాయని, జగన్ గారి మీద తప్పు ముద్రను వేయడం అనైతికమని గౌతమ్ అన్నారు….

ప్రజలు మిమ్మల్ని నమ్మే రోజులు పోయాయని, జగన్ గారు ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చిన నాయకుడని,
ఆయన గొప్పతనాన్ని తగ్గించేందుకు తప్పుడు ఆరోపణలు చేయడం వల్ల మీ విశ్వసనీయత పెరగదని, ప్రజలు మళ్లీ పనిచేసే చేతుల పక్కనే నిలబడతారు గౌతమ్ తెలిపారు.