భారత్ న్యూస్ మచిలీపట్నం……నూతన బార్ల దరఖాస్తులకు లక్కీ డ్రా ద్వారా ఎంపిక ప్రక్రియ.
నూతన బార్ పాలసీ విధానం 2025 కృష్ణాజిల్లా లో బార్ల దరఖాస్తుల ఎంపిక ప్రక్రియను మచిలీపట్నం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం మీకోసం మందిరం లో నిర్వహించారు.
బార్ల దరఖాస్తు ఎంపిక ప్రక్రియ జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయనున్నారు.
జిల్లావ్యాప్తంగా 130 బార్లకు లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయనున్నారు వాటిలో ఓపెన్ క్యాటగిరి 126, నాలుగు బార్లు గీతకుల కార్మికులకు డ్రా నిర్వహిస్తున్నారు.

ఒకటి, రెండు, మూడు బార్లకు అప్లికేషన్స్ రానందున డ్రా తీయడం వాటిని నిలిపివేశారు. 4 నెంబర్ బార్ కు మొదటిగా లక్కీ డ్రా గీతాంజలి శర్మ నిర్వహించారు.
లక్కీ డ్రా విధానం వరుస క్రమంలో మొదటగా మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు, అవనిగడ్డ, తాడిగడప.