బంగాళాఖాతంలో వాయుగుండం.. తీరం దాటనున్న తుఫాను

భారత్ న్యూస్ గుంటూరు….బంగాళాఖాతంలో వాయుగుండం.. తీరం దాటనున్న తుఫాను

Jan 09, 2026,

బంగాళాఖాతంలో వాయుగుండం.. తీరం దాటనున్న తుఫాను
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రానికి శ్రీలంకలోని హంబన్‌తోట, బట్టికోల మధ్య తీరం దాటే అవకాశం ఉంది.

దీని ప్రభావంతో నేడు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.