ప్రాణాలు తీసిన ప్రేమ.. మహిళా కానిస్టేబుల్ మృతి

భారత్ న్యూస్ అనంతపురం .. Ammiraju Udaya Shankar.sharma News Editor….ప్రాణాలు తీసిన ప్రేమ.. మహిళా కానిస్టేబుల్ మృతి

ఆంధ్రప్రదేశ్ :

వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ప్రశాంతి (25) ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

చిత్తూరు జిల్లా మార్వాడకు చెందిన వాసుతో కొన్నాళ్ల కిందట ఆమెకు పరిచయం ఏర్పడగా..

అది కాస్త ప్రేమగా మారింది. అంతకుముందే వాసుకు వివాహం జరిగిన విషయాన్ని దాచాడు.

ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలని ప్రశాంతి అడగగా.. వాసు ముఖం చాటేశాడు.

దాంతో ఆమె వాసు ఇంటికి వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.