భారత్ న్యూస్ విజయవాడ…చిలకలూరిపేట కోర్టులో మెగా లోక్ అదాలత్
జడ్జి నరేందర్ రెడ్డి ప్రకటన
చిలకలూరిపేట కోర్టులో ఈ నెల 13వ తేదీన మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నాల్గవ నేషనల్ లోక్ అదాలత్ను పురస్కరించుకుని మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించబడుతున్నట్లు జడ్జి నరేందర్ రెడ్డి మీడియాకు తెలిపారు.
రెండు బెంచీలు ఏర్పాటు..
ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రాంగణంలో, అలాగే అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ప్రాంగణంలో కలిపి మొత్తం రెండు బెంచీలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వివరించారు.
విచారించే కేసులు…
ఈ రెండు బెంచీలలో మొత్తం క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, ఎన్ఐ యాక్ట్ కేసులు, ప్రో-నోట్ కేసులు, మరియు ఇతర సివిల్ దావాలు ఏవైనా ఉన్నా వాటన్నింటినీ రాజీ చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు.

న్యాయం కోసం విజ్ఞప్తి…
చిలకలూరిపేట కోర్టు పరిధిలో ఉన్న కక్షిదారులు మరియు న్యాయవాదులు అందరూ ఈ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకొని, తమ కేసులను రాజీ చేసుకొని సత్వర పరిష్కారం మరియు సత్వర న్యాయం పొందాలని జడ్జి నరేందర్ రెడ్డి కోరారు.ఈ 4వ నేషనల్ లోక్ అదాలత్లో పాల్గొని ఎక్కువ కేసులను రాజీ చేసుకోవడం ద్వారా మంచి ఫలితం పొందాలని ఆయన ఆకాంక్షించారు.