కల్తీ మద్యం కేసు .. ఇద్దరు టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

భారత్ న్యూస్ రాజమండ్రి…కల్తీ మద్యం కేసు .. ఇద్దరు టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

Ammiraju Udaya Shankar.sharma News Editor…కల్తీ మద్యం వ్యవహారంపై కీలక నిర్ణయం తీసుకున్న టీడీపీ అధిష్ఠానం

తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి, స్థానిక నేత సురేంద్ర నాయుడుల సస్పెన్షన్

ప్రకటన విడుదల చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

అన్నమయ్య జిల్లా ములకలచెరువు కల్తీ మద్యం తయారీ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులపై కఠిన చర్యలు చేపట్టింది.

ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన తంబళ్లపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‍ఛార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి, స్థానిక తెలుగుదేశం పార్టీ నేత కట్టా సురేంద్ర నాయుడులను పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నిన్న రాత్రి ప్రకటన విడుదల చేశారు.

ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

నకిలీ మద్యం వ్యవహారంలో జయచంద్రారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి రాజేశ్, సన్నిహితుడు జనార్దన్ రావు, సమీప బంధువుల పాత్ర ఉన్నట్లు నిర్ధారణ కావడంతో వారిపై ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేశారు.