శ్రీశైలం పాతాళగంగ మెట్ల దారిలో సత్యనారాయణ శాస్త్రి ఇంటి ముందు భాగంలో అర్ధ రాత్రి 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో చిరుతపులి సంచరించడం జరిగింది.

భారత్ న్యూస్ రాజమండ్రి…నంద్యాల.. జిల్లా శ్రీశైలం

Ammiraju Udaya Shankar.sharma News Editor…శ్రీశైలం పాతాళగంగ మెట్ల దారిలో సత్యనారాయణ శాస్త్రి ఇంటి ముందు భాగంలో అర్ధ రాత్రి 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో చిరుతపులి సంచరించడం జరిగింది.ఇది సీసీ కెమెరాలో రికార్డు అవ్వడంతో ఆయాన వెంటనే చిరుత పులి సంచారాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈఓ శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు సమాచారం తెలిసిన వెంటనే ఆ ప్రాంతంలో లో ఉండే స్థానికులు,భక్తులను అప్రమత్తం చేశారు. ఈ మెట్ల మార్గం ద్వారానే భక్తులు తెల్లవారు జామున పాతాళ గంగలో స్థానాలు ఆచరించడానికి నిత్యం వేలాది మంది భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు.పాతాళ గంగ,సమీపన స్థానికులు నివాసం ఉండే ప్రాంతాల్లో మైకుల ద్వారా చిరుత పులి సంచారాన్ని తెలియజేస్తు అందరిని జాగ్రత్తగా ఉండాలని ఆలయ అధికారులు సూచనలు చేశారు….