భారత్ న్యూస్ మంగళగిరి….Ammiraju Udaya Shankar.sharma News Editor…కర్నూల్ ఉల్లి మార్కెట్ యార్డ్ ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఉల్లికి అందుతున్న గిట్టుబాటు ధర మీద రైతులతో చర్చించడం జరిగింది. ఉల్లి రైతుల బాధలు వర్ణనాతీతం. పెట్టిన పెట్టుబడి మందం కూడా రైతుకి దక్కడం లేదు. ఒక్కో రైతుకి ఎకరాకు రూ.80వేల నుంచి రూ.1.20 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. కానీ మార్కెట్ లో క్వింటాకు 600 రూపాయలు కూడా ఇవ్వడం లేదు. గత ఏడాది ఇదే మార్కెట్ లో క్వింటాకు రూ.4500 ధర పలికింది. ఇప్పుడు 300 రూపాయలకు ఇస్తారా అని అడగడం దారుణం. ఉల్లికి మద్దతు ధర లేక ఇద్దరు రైతులు ఆత్మహత్య హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ రైతులకు YCP రైతులు అని రాజకీయం పులిమి కేసులు పెట్టారు పండించిన పంటకు రాజకీయం ఏంటి చంద్రబాబు గారు ? ఇది మీకు తగదు. ఉల్లి రైతులకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఇప్పుడు ధర రూ. 1200 అని చెప్పి మళ్లీ మోసం చేస్తున్నారు. డిఫరెన్స్ అమౌంట్ ఒకరికి కూడా అకౌంట్ లో పడలేదు. గత ఏడాది కూడా కొంతమంది రైతులకు ఇలానే చెప్పి ఇంతవరకు చెల్లించలేదు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నారు. రైతు సుభిక్షంగా ఉండటమే మీ అజెండా అన్నారు. ఉల్లి మీద సమీక్షలు అవసరం లేదు అన్నారు. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా గిట్టుబాటు వెంటనే ఇస్తాం అన్నారు. విదేశాల నుంచి ఆర్డర్లు తెచ్చి ఉల్లిని ఎగుమతి చేస్తా అన్నారు. ఇంతవరకు ఒక్క హామీ నెరవేర్చలేదు. మీరు ఇప్పుడు ఇస్తామని చెప్పిన డిఫరెన్స్ మీద రైతులకు నమ్మకం లేదు. చంద్రబాబు గారు వెంటనే ఉల్లి రైతుల మీద దృష్టి పెట్టండి. ప్రభుత్వం క్వింటా ఉల్లి 2500 రూపాయలకు కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
