భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణా జిల్లా

Ammiraju Udaya Shankar.sharma News Editor…సంక్రాంతి సందర్భంగా ముస్తాబుకి రెడీ అవుతున్న కోడి పందాల బరులను వినూత్నరుతిలో ధ్వంసం చేసిన కృష్ణాజిల్లా పోలీసులు
ఘంటసాల మండలం లంకపల్లి హైవే పక్కన ఉన్న రెండు ఎకరాల స్థలంలో కోడిపందాలు బరులను సిద్ధం చేస్తున్నారని సమాచారం అందుకున్న ఘంటసాల ఎస్సై పొలం దున్నే ట్రాక్టర్ తో పందెం బరిని దుక్కి దున్నిన ఘంటసాల పోలీసులు
అదే రీతిలో గుడివాడ రూరల్ మండలం మల్లయ్య పాలెం టి డ్కో గృహాల ప్రక్కన ఉన్న 10 ఎకరాల భూమిని సంక్రాంతి సందర్భంగా సిద్ధం చేస్తున్న పందెం రాయుళ్లు
గుడివాడ రూరల్ ఎస్సై ఆధ్వర్యంలో పొలంలోకి ట్రాక్టర్ వేసుకెళ్లి బరిని ట్రాక్టర్ తో దుక్కి దున్నిన గుడివాడ రూరల్ పోలీసులు

కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సంక్రాంతి సందర్భంగా ఎటువంటి కోడి పందాలు పేకాట బరులు సిద్ధం చేస్తే వెంటనే ధ్వంసం చేయాలన్న జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామన్న పోలీసులు