ఏలూరు జిల్లా ముదినేపల్లి::::భారత్ న్యూస్ ప్రతినిధి:: కొటప్రొలు కృష్ణ సమక్షంలో నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి దశదిన కార్యక్రమానికి ఆర్ధిక సహాయం, పెదపాలపర్రు గ్రామ నివాసి నిరుపేద బ్రాహ్మణ కులమునకు చెందిన బొడ్డపాటి వెంకట్రావు అనారోగ్యంతో మరణించినారని తెలిసి దశదిన కార్యక్రమం నిర్వహించుటకు గాను నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి బాసటగానిలిచి ఏలూరు జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ ఆదేశానుసారం మండలాధ్యక్ష్యురాలు సత్యవోలు నాగలక్ష్మి ఆధ్వర్యంలో ముదినేపల్లి మండల నాయకులు, కార్యకర్తలు, సీనియర్ జర్నలిస్ట్ బొడ్డపాటి భుజంగ వెంకట నరసింహారావు తండ్రి వెంకట్రావు మరణావార్త తెలిసి బి.జే.పీ.పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలసి వెంకట్రావు పార్దివ దేహానికి నివాళులు అర్పించి, ప్రాఘడ సానుభూతిని తెలియజేసి,ఈ రోజున బ్రాహ్మణ సాంప్రదాయ బద్దముగా దశదిన కార్యక్రమాలు నిర్వహించటానికి 20,000రూపాయలు రూపాయలు ఆర్ధిక సహాయం అందించి భవిష్యత్తులొ వారీకుటుంబానికి తమవంతుగా అండగా నిలబడమని, వారి కుటుంబానికి బాసటగా నిలిచి సహాయ,సహకారాలు అందిస్తామన్నారు. కోటప్రోలు కృష్ణ,బి.జే.పీ. నాయకులు, కార్యకర్తలు భాదిత కుటుంబానికి తమ సానుభూతిని తెలియచేసారు
