ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన కనపర్తి శ్రీనివాసరావు

.భారత్ న్యూస్ అమరావతి..ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన కనపర్తి శ్రీనివాసరావు

అవనిగడ్డ రాజకీయ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా.. స్థానిక ఎన్నికలపై చర్చ

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శుక్రవారం అమరావతిలో అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలు మరియు పార్టీ బలోపేతంపై చర్చించారు.ఈ భేటీ సందర్భంగా కనపర్తి శ్రీనివాసరావు నియోజకవర్గంలో పార్టీ ప్రస్తుత పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించారు.త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడం,మరియు అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత పెంచటంతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేయాలని చంద్రబాబు నాయుడు కనపర్తి శ్రీనివాసరావును ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం పదవులు కూటమి గెలిచే విధంగా ఇప్పటి నుండే ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు.